![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం' (Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -18 లో... పైడిరాజు దగ్గరికి వీరు వాళ్ళ మనిషి ఒకడు వస్తాడు. నేను కోటి రూపాయలు ఎదురుకట్నం ఇస్తాను.. నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్.. ఆ తర్వాత ముంబై తీసుకొని వెళ్తానని చెప్పగానే దానికి పైడిరాజు సరే అంటాడు. పైడిరాజు ఒప్పుకున్న విషయాన్ని అతను వీరుకి ఫోన్ చేసి చెప్తాడు. గంగని నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఇచ్చేయ్ అని వీరు అంటాడు. దానికి అతను సరే అంటాడు.
గంగ కిచెన్ లో ఉండగా మక్కం ఇంటికి వస్తాడు. గంగ అక్కడ ఉండడం చూసి నువ్వు ఇక్కడ ఉన్నావ్ ఏంటని అడుగుతాడు. నన్ను పెద్దసారు పనిలో పెట్టాడు. నువ్వు నా గురించి సర్ తో చెప్తే నీ సంగతి చెప్తానని మక్కంని బ్లాక్ మెయిల్ చేస్తుంది గంగ. అప్పుడే రుద్ర వస్తాడు. తనకి కనిపించకుండా గంగ మొహంపై చున్నీ కప్పుకుంటుంది. ఇద్దరికీ కాఫీ తీసుకొని రమ్మని గంగకి చెప్తాడు రుద్ర. మా పెద్దమ్మ నీ వల్ల హ్యాపీగా ఉంటుందని విన్నాను.. ఎప్పుడు అలాగే ఉండేలా చూడు అని గంగతో రుద్ర అంటాడు. రుద్ర సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అతని కంటే ముందే వెళ్ళాలని మక్కం స్కూటీపై గంగ వెళ్తుంది. ఇక గంగ స్పీడ్ గా వెళ్తూ మక్కంని వాటర్ లో పడేస్తుంది. ఆ తర్వాత రుద్ర కంటే ముందే గంగ సూపర్ మార్కెట్ కి వెళ్తుంది.
అక్కడ ఒకమ్మాయి ప్రేమించిన అబ్బాయి మోసం చేసాడని సూసైడ్ చేసుకోబోతుంటే రుద్ర ఆపి ఒక్కరోజు టైమ్ ఇవ్వు.. నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ లో మీటింగ్ జరుగుతుంది. అక్కడికి గంగని కూడా పిలుస్తారు. అసలు గంగని ఇక్కడికి ఎందుకు పిలిచావని పెద్దసారు అడుగుతాడు.
తరువాయి భాగంలో గంగ చెవికమ్మ రుద్ర రూమ్ లో పడిపోతుంది. ఇక రుద్ర స్నానం చేస్తున్న సమయంలో గంగ తన చెవికమ్మ కోసం అతని గదిలోకి వెళ్ళి వెతుకుతుంది. ఇక రుద్రపై ఉన్న కోపాన్ని పిల్లోని పట్టుకొని.. ఇది మీరే అంటూ పిల్లోని కొడుతుంది గంగ. ఇక అప్పుడే వెనకాల నుండి ఎవరో వచ్చి తన భుజంపై చేయి వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |